యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం యొక్క ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికాలకు తమ స్నేహబంధం ఆకాంక్షల సందేశం వెలువరించారు. భారత్ అమెరికాలు ప్రజాస్వామ్య నిబద్ధత గల దేశాలుగా ముందుకు సాగుతున్నాయి. చట్టబద్ధమైన పాలనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఉమ్మడి విలువలు, సారూప్యత రెండు దేశాలను కలిపే సూత్రం అవుతోందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రపంచ శాంతి దిశలో భారత్ అమెరికా మధ్య స్నేహ బంధం ఓ అపరిమిత శక్తి అవుతుందని ఆకాంక్షించారు. ఇరుదేశాల బంధం కేవలం వ్యూహాత్మక భాగస్వామికమే కాకుండా అంతకు మించిన బంధం అని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన తాము పంపించే సందేశం ఇరుదేశాల స్నేహ బంధానికి ప్రతీక అని. 1776 జులై 4వ తేదీన గ్రేట్ బ్రిటన్ పాలనను తెంచుకుని అమెరికాలోని 14 కాలనీలు లేదా ప్రాంతాలు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరుతో స్వాతంత్ర్యం సిద్ధించాయి. అప్పటినుంచి అమెరికా సంయుక్త రాష్ట్ర ఉనికి సాగుతోంది.

