హస్తకళ మహోత్సవం వేదికపై కళాకారుల ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరుసటి రోజే క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఉన్నాయి. రెండు రోజులు గడవక ముందే ఆయన తన హామీని నిలబెట్టుకున్నారు.
ముఖ్యంగా లెస్ కళాకారులలో కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, కలంకారీ కళాకారులలో కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రతి కళకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయనే సూచించారు. నరసాపురంలో 105 మంది కళాకారుల్లో 37 మందికి కంటి సమస్యలు, వారిలో 16 మందికి శుక్లాలు గుర్తించడం ఈ రంగంలో ఆరోగ్య పరిరక్షణ ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది.
సమస్య చెప్పిన మహాలక్ష్మి, అందె లక్ష్మి అనే ఇద్దరు కళాకారిణులను మరుసటి రోజే శంకర నేత్రాలయకు తరలించి పరీక్షలు చేయడం విశేషం. హస్తకళల పరిరక్షణ అంటే కేవలం కళాకృతులకు మార్కెట్ కల్పించడం మాత్రమే కాదు. ఆ కళను సృష్టించే కళాకారుడి ఆరోగ్యం, జీవనోపాధి, సామాజిక భద్రతను కూడా కాపాడాలి అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఈ మేరకు బుధవారం నరసాపురం లెస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు.
నరసాపురంలో 105 మంది లెస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు జరిగాయి. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు. మొత్తమీద పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన మరుసటి రోజే హామీలు నిలబెట్టుకోవడం ప్రశంసలను అందుకుంటుంది.

