ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. మళ్లీ అదే చెత్త షాట్‌తో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. మూడో టీ20 తరహాలోనే షార్ట్ పిచ్ డెలివరీతో వైభవ్‌ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌ను వైభవ్ ఆచితూచి ఆడాడు. జోష్ టంగ్ వేసిన రెండో ఓవర్లో మాత్రం వరుసగా 4, 6 బాది జోరు కనబర్చాడు. కానీ ఆర్చర్ వేసిన మూడో ఓవర్లో మాత్రం పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు.
నాలుగో బంతిని ఆర్చర్.. షార్ట్ పిచ్ డెలివరీగా వేయగా.. టెంప్ట్ అయిన వైభవ్ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మిడాన్ దిశగా గాల్లోకి లేవగా.. సామ్ కరణ్ అందుకున్నాడు. దాంతో వైభవ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ వరుసగా రెండో సారి ఔటవ్వడం.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. ఆ మ్యాచ్‌లో 14 పరుగుల పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మూడో టీ20లో 13 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్‌లో 15 పరుగుల తాజా పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడలేక వైభవ్ మూల్యం చెల్లించుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీతో పాటు ఇషాన్ కిషన్(4), అభిషేక్ శర్మ(16) కూడా తీవ్రంగా నిరాశపరిచారు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔటవ్వగా.. అభిషేక్ శర్మ(16)ను ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కథనం మొదట ప్రచురించబడింది: గురువారం, జూలై 9, 2026, 22:47 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 9, 2026

