తెలంగాణ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయితే లాభం లేదు. కేసీఆర్ మంచికర్త వ్యూహం కావచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఉండవచ్చు. అది గతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లవుతుంది. ఇప్పుడు ఆ చరిత్రను పెద్దగా ఎవరూ గుర్తుంచుకోరు. అదే సమయంలో ప్రజా సమస్యలపై స్పందించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం కూడా పార్టీకి పెద్ద దెబ్బే అవుతుందని అంటున్నారు. ఇంత జనంలోకి రా పాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరు అవుతుండటం పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చే అంశమే. ఎందుకంటే పదవి లేకుంటే కనీసం ప్రజల గురించి పట్టించుకోరన్నది ఇప్పటికే జనంలోకి వెళ్లింది.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు సాగు నీరు అందడం లేదు. పంటలు వేయలేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి సమస్యలపై ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ లోనే ఉన్నందున ఈయన ప్రజా సమస్యలపై పెద్దగా పట్టింపు లేదని, ఎన్నికల సమయంలోనే తాము గుర్తుకు వస్తామన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. హరీశ్ రావు, కేటీఆర్ లు జనంలోకి వెళుతూ సమస్యలపై పోరాడుతున్నప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితం కనిపించడం లేదన్న భావన వ్యక్తమవుతుంది. కేసీఆర్ బయటకు వస్తేనే క్యాడర్ లోనూ, లీడర్లోనూ కదలిక కనపడుతుంది. పార్టీ క్షేత్రస్థాయిలో యాక్టివ్ అవుతుంది.
ఇక అధికార పక్షం సవాల్ మీద సవాల్ విసురుతోంది. అసెంబ్లీకి వచ్చి ఏ అంశంపైనా చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మైకు పట్టుకుంటే అందరూ మౌనంగా ఉండే అవకాశముంది. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలితే అది ఆయనకు ప్లస్ గానే మారుతుంది. కానీ మైన్స్ కాదు. ఒకవేళ పదే పదే అడ్డు తగిలితే అప్పుడు సభ నుంచి వాకౌట్ చేసి రావచ్చు. కానీ తాను రేవంత్ ముందు సభలో ఉండనని భీష్మించుకుని ఫామ్ హౌస్ లోనే సేదతీరడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజం. అధికారం శాశ్వతం కాదు. కానీ కేసీఆర్ తన ముందు అందరూ జీరోలే అన్నట్లు వ్యవహరించడం మరోసారి ఆయన దొరతనాన్ని చాటినట్లవుతుందన్న కాంగ్రెస్ నేతల విమర్శలు నిజమనే అనుకోవాల్సి ఉంటుంది.

