నారా బ్రాహ్మణి : మామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన వ్యక్తి. నాన్న తెలుగు సినిమా రంగంలో కీలకమైన కథానాయకుడు.. భర్త ఏపీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి.. అత్త హెరిటేజ్ ఫుడ్స్ చైర్ పర్సన్.. ఇలా ఎటు చూసినా సరే బలమైన ఆర్థిక నేపథ్యం.. అంతకుమించిన కుటుంబం ఆమె సొంతం.. అయినా ఆమె పనిచేయడం మానలేదు. ప్రయోగాలు చేయడం వదులుకోలేదు. చివరిగా ఆమె మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ లాగా అవతరించింది. ఏకంగా ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు సంపాదించింది.
ఫార్చ్యూన్ ఇండియా యొక్క 100 మంది శక్తివంతమైన మహిళలలో 2026 గుర్తింపు పొందినందుకు బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమె నాయకత్వం, అంకితభావం మరియు శ్రేష్ఠత పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఆమె లెక్కలేనన్ని యువకులకు స్ఫూర్తినిస్తూ మా కుటుంబాన్ని గర్వించేలా చేస్తూనే ఉంది… pic.twitter.com/KoKjDkvTK6
– ఎన్ చంద్రబాబు నాయుడు (@ncbn) జూలై 11, 2026
ఈ స్థాయిలో ఘనత సాధించిన ఆమె పేరు నారా బ్రాహ్మణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో అత్యంత కీలకమైన డెయిరీ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. రైతులతో మమేకం కావడం లేదు.. నాణ్యమైన పాల ఉత్పత్తి సాధించడం.. ఆహారం మనసు చూరగొనడం.. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ ను అత్యున్నత స్థాయిలో నిలిపారు. ఫలితంగా ఈ కంపెనీ మరిన్ని లాభాలను సాధిస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. తమిళనాడు.. కర్ణాటకలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. డెయిరీ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మరింత మార్కెట్ సొంతం చేసుకుంటున్నది. దీని వెనక నారా బ్రాహ్మణి కృషి ఉంది. ఆమె ప్రణాళికలు.. భవిష్యత్తు లక్ష్యాలు హెరిటేజ్ కంపెనీని అత్యున్నత స్థాయిలో నిలిపాయి.
ఫార్చ్యూన్ ఇండియా యొక్క 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో బ్రాహ్మణి ఒకరిగా పేర్కొనడం చూసి చాలా గర్వంగా ఉంది! ప్రకాశిస్తూ, నడిపిస్తూ, అడ్డంకులను ఛేదిస్తూ ఉండండి!@బ్రాహ్మణీనారా https://t.co/dHr0d1nfnI pic.twitter.com/xT1Frmh9s8
– లోకేష్ నారా (@naralokesh) జూలై 11, 2026
నారా బ్రాహ్మణి లో ఉన్న అసలు సిసలైన వ్యాపారవేత్తలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆమె నాయకత్వ పటిమను గుర్తించిన ఫార్చ్యూన్ ఇండియా.. నారా బ్రాహ్మణిని ఇండియా 100 మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ గా ఎంపిక చేసింది. ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను బలోపేతం చేయడం.. రైతులతో సాగిస్తున్న ప్రయాణం.. వారితో పెంచుకున్న బంధం.. పాల ఉత్పత్తిలో చేస్తున్న ఆవిష్కరణలు.. ఇవన్నీ కూడా నారా బ్రాహ్మణి ని నాయకత్వ పటిమకు నిదర్శనంగా భావించిన ఫార్చ్యూన్.. ఆమెకు 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో చోటు కల్పించింది. బ్రాహ్మణి ఈ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఇటువంటి పురస్కారాలు మరిన్ని సాధించాలని.

