మళ్లీ కోల్డ్ వార్ కోహ్లి vs గంభీర్: ప్రస్తుతం 3 వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టులో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అనే అనుమానాలు ఇప్పుడు ఫ్యాన్స్ ని తెగ వేధిస్తున్నాయి. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంటితో తొలి వేదిక ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌లో కనీసం ఇద్దరు మాట్లాడుకోలేదని వస్తున్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నెట్స్‌లో కనిపించని కెమిస్ట్రీ:
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను గంభీర్ చాలా నిశితంగా గమనించారు. కానీ నేరుగా కింగ్ కోహ్లీ దగ్గరికి వెళ్లి సలహాలు ఇవ్వకుండా, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ద్వారా సందేశాలను పంపడం అవసరం. ఈ సెషన్లో అనవసర షాట్లకు ప్రయత్నించి కొన్నిసార్లు క్లీన్ బౌల్డ్ కావడంతో గంభీర్ స్వయంగా వెళ్లి.. బ్యాటింగ్ కోచ్‌కు చెప్పి కోహ్లీతో మాట్లాడాడు. ఈ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ కి సంబంధించిన వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య మళ్లీ లొల్లి స్టార్ట్ అయిందనే ప్రచారం జరుగుతుంది.
గిల్, రోహిత్‌లతో మాటలు.. కోహ్లీతో మాత్రం నో టాక్స్:
ప్రాక్టీస్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో పాటు కోచ్ సితాన్షు కోటక్‌తో సుదీర్ఘంగా మాట్లాడాడు. కానీ, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో మాత్రం ఒక్కసారిగా మాట్లాడినట్లు ఎక్కడ కూడా కనిపించలేదు. అటు కోహ్లీ కూడా గంభీర్ సైడ్ వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. ఈ నిశ్శబ్ద యుద్ధం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోల్డ్ వైబ్స్ కు అద్దం పడుతోందని ఇంటర్నేషనల్ మీడియా కోడైకూస్తుంది.
ఇంకా చదవండి: పైసల్ ఇస్తేనే NOC..
ఐపీఎల్ గొడవలు.. వైడ్ సిరీస్‌పై ఎఫెక్ట్ పడేనా:
గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా గంభీర్, కోహ్లీ మధ్య జరిగిన క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేశాయి. అయితే గంభీర్ అధికారికకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఈ ఇద్దరూ ఎంతో ప్రొఫెషనల్‌గా కలిసి పని చేసినప్పటికీ, ఇరువురి మధ్య సయోధ్య మాత్రం కుదిరినపట్లు ఎక్కడ కనిపించలేదు.. మధ్య గ్యాప్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్.. వన్ సిరీస్‌లోనైనా పుంజుకోవాలంటే కోచ్, సీనియర్ ప్లేయర్ మధ్య సమన్వయం చాలా అవసరం.. మరి ఈ సైలెంట్ వార్ ఎఫెక్ట్ సిరీస్ పై ఏమైనా పడుతుందో లేదో చూద్దాం..
🔥 కోహ్లి స్నబ్స్ గంభీ! 😤
జీరో ఇంటరాక్షన్‌తో ఎడ్జ్‌బాస్టన్ ప్రాక్టీస్‌లో నేరుగా కోచ్ గౌతమ్ గంభీర్‌ను దాటి వెళ్లిన విరాట్!
మాటలు లేవు. కంటిచూపు లేదు. కేవలం చల్లని వైబ్స్.
ఇంతలో, కోహ్లి శుభ్‌మన్ గిల్‌తో చాలాసేపు చాట్ చేస్తూ కనిపించాడు
ఇంగ్లండ్ వన్డేకు ముందు టీమిండియాలో టెన్షన్…
— BiswaaX (@BiswaaX) జూలై 14, 2026

