– ప్రకటన –
పశ్చిమాసియాలో ఆగని దాడులు
ఇరాన్ – అమెరికా హోరాహోరీ
ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
జలసంధిలో ఫీజు వసూలు : ట్రంప్
నవతెలంగాణ – జనరల్ డెస్క్
పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా సేనలు మంగళవారం ఉదయమే దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధిలోని ఇరాన్ ఓడరేవులను మరోసారి దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే పోరు మొదలైంది. జలసంధిలో ఇరాన్ యేతర నౌకలు సురక్షితంగా ఉంచేందుకు డబ్బు వసూలు చేయాలని కూడా ట్రంప్ చెప్పారు. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా బహ్రైన్, జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. యూఏఈకి సంబంధించిన రెండు నౌకలు…మొంబాసా, అల్ బాహ్యాలు హార్ముజ్‌లో ప్రయాణిస్తుండగా వాటిపై కూడా దాడి చేసి నిప్పు పెట్టింది. ఈ దాడిలో నావికుడు మరణించగా ఎనిమిది మంది గాయపడ్డారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేసి ఒమన్ సమీపంలోని హార్ముజ్‌ను దాటుతున్నందున నౌకలపై దాడి చేశామని రివల్యూషనరీ గార్డులు తెలిపారు. దీంతో ఇరాన్‌పై తాను ప్రతీకార దాడి చేస్తానని ఎమిరేట్స్ హెచ్చరించింది. తాజా పరిణామాలు యూఏఈ కూడా ఇరాన్‌తో పోరుకు యుద్ధభూమిలో అడుగు పెడుతోంది.
చావు దెబ్బ కొట్టాం : ట్రంప్ బీరాలు
ఇరాన్ కోస్తా రక్షణ వ్యవస్థలు, క్షిపణి – డ్రోన్ కేంద్రాలు, సముద్రయాన సామర్ధ్యాలను లక్ష్యంగా చేసుకొని అబూ మసూ, బందర్ అబ్బాస్, ఛాబాహార్, జస్క్, కోనారక్ పరిసర ప్రాంతాలపై దాడులు చేశామని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించింది. బందర్ అబ్బాస్లోనూ, కిష్, ఖేష్మ్, అబూ మసూ దీవులలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా దాడులను ఇరాన్ ధృవీకరించింది. ‘ఇరాన్ సైనికులకు భారీ నష్టం కలిగించే దాడులు కొనసాగుతున్నాయి. హార్ముజ్‌లో అమాయక పౌరులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే దాని సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాం’ అని అమెరికా సైన్యం చెప్పింది. ‘ఇది ట్రంప్ మరో పెద్ద దాడి’. ‘మేము వారిని చావు దెబ్బ కొట్టాం. అది కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూస్తాం’ అని అన్నారు. వారి సామర్ధ్యాన్ని నాశనం చేశామని, జలసంధిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నా మని చెప్పుకొచ్చారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని తిరిగి కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించామని ఆయన కాంగ్రెస్‌కు తెలియజేశారు. హార్ముజ్‌లో రవాణా నౌకల నుంచి టోల్ వసూలు చేయవలసి ఉంది. నౌకలపై టోల్ విధించబోమని ట్రంప్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
పికాక్స్ జోలికొస్తే వినాశనమే : ఇరాన్
ఇరాన్ సేనలు మంగళవారం ఉదయం బహ్రైన్పై క్షిపణు లు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఆయుధాలను నిల్వ ఉంచే గిడ్డంగులు ఉపగ్రహ కమ్యూనికేషన్ కేంద్రం, అమెరికా భవనం ధ్వంసమయ్యాయని ఐఆర్జీసీ ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. బయ టకు రాకూడదని, సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. బహ్రైన్లో అమెరికా నౌకాదళ ఐదో ఫ్లీట్ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇరాన్ ప్రయోగించిన నాలుగు క్షిపణులను అడ్డుకున్నానని జోర్డాన్ విడుదల. జోర్డాన్ కూడా అమెరడువుదళాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇరాన్‌లోని పికాక్స్ పర్వతంపై దాడి చేస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికపై టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. అదే జరిగితే వినాశనం తప్పదని, అమెరికా సైన్యం, దాని ప్రాంతీయ మిత్రులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పికా పర్వతంపై ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమె రికా ఆరోపిస్తుండగా అందులో నిజం లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.
గడువులో సగం పూర్తి ముందుకు పడని అడుగులు
కీలక హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో దాడులు ఉధృతమవుతున్నాయి. సరఫరాలకు ఏర్పడిన విఘాతం కారణంగా బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు ధర గత నెల రోజులలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం బ్యారల్‌కు 84 డాలర్లకు చేరింది. , ఇరాన్ మధ్య ఎంఓయూ అమెరికా గడువు కుదిరి సుమారు 30 రోజులు గడిచిపోయాయి. అంటే తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి నిర్ణయించుకున్న 60 రోజుల గడువులో దాదాపు సగం పూర్తయింది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
హార్ముజ్‌పై మాట మార్చిన అమెరికా
హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా వైఖరిలో మార్పు కన్పిస్తోంది. జలసంధిలో అన్ని నౌకలు ఉపయోగించవచ్చని, ఎలాంటి రుసుములు ఉండవని ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు అమెరికా గుర్తించింది. అయితే ఇప్పుడు మాట మార్చింది. హార్ముజ్‌లో టోల్ వసూలు చేసేందుకు అమెరికా, ఇరాన్ ప్రయత్నించడం స్వేచ్చాయుత నౌకాయానానికి సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతాయి. మధ్యప్రాచ్యంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పుడు ఘర్షణల దృష్టి హార్ముజ్ పైనే నిలిచింది. తాత్కాలిక ఒప్పందం ప్రకారం జలసంధిని ఇరాన్ తెరవాల్సి ఉంది. అయితే అందులో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలపై ఇరాన్ దాడులకు దిగడంతో పరిస్థితి గాడి తప్పింది. హార్ముజ్‌ను బలప్రయోగంతో అయినా తెరిపిస్తానని అమెరికా చెబుతోంది. అయితే అందుకు భారీగా సైనికుడు, ఆయుధ సంపత్తి అవసరమని నిపుణులు అంచనా వేశారు.
నిండుకుంటున్న అమెరికా ఆయుధ నిల్వలు
ఇరాన్ యుద్ధంలో అమెరికా తన వద్ద ఉన్న ఆయుధ నిల్వల్లో మూడో వంతు నుంచి దాదాపు సగం వరకూ వాడేసింది. దీంతో అమెరికా అమ్ముల పొదిలోని ఆయుధాలు క్రమేపీ తరిగిపోతున్నాయని రిటైర్డ్ మిలిటరీ కల్నల్, రక్షణ నిపుణుడు మార్క్ కాన్సియన్ చెప్పారు. ఘర్షణ ప్రారంభ దినాలలో దూర ప్రాంతాలలోని లక్ష్యాలపై దాడుల కోసం అమెరికా వేలాది క్షిపణులను ఉపయోగించింది. యుద్ధంలో వెయ్యికి పైగా పాట్రియాట్ క్షిపణులను ఉపయోగించామని, గల్ఫ్‌లోని తమ మిత్ర దేశాలు కూడా చాలా ఆయుధాలను వాడాలని, ఉక్రెయిన్ కూడా ప్రస్తుత ఆయుధాలను కోరుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి కోసం అధిక డిమాండ్ ఉందని కాన్సియన్ తెలిపింది. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలో పాట్రియాట్ కీలకమైనది. ఇందులో లాంఛర్లు, రాడార్లు, శత్రువుల దాడులను అడ్డుకునే క్షిపణులు ఉంటాయి. సంవత్సరానికి కేవలం 600 పాట్రియాట్ వ్యవస్థలను మాత్రమే ఉత్పత్తి చేయగలరు. ఒక్కో వ్యవస్థకు బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. కొత్త పాట్రియాట్ కావాలంటే నాలుగైదు సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి.
ట్రంప్ హార్ముజ్ ఫీజుతో… సూపర్ ట్యాంకర్‌పై 30 మిలియన్ డాలర్ల భారం
హార్ముజ్‌లో సరఫరా చేసే చమురు నౌకల నుంచి 30 మిలియన్ డాలర్ల చొప్పున వసూలు చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన షిప్పింగ్ కంపెనీలకు వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం బ్యారల్ చమురు ధర 80 డాలర్లుగా ఉంది. ఒక్కో సూపర్ ట్యాంకర్లో రెండు మిలియన్ బ్యారల్స్ ముడి చమురును నింపవచ్చు. దీని ఆధారంగానే ఒక్కో నౌక నుంచి 30 మిలియన్ డాలర్లు వసూలు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. ప్రస్తుతం ఇరాన్ కేవలం రెండు మిలియన్ డాలర్ల టోల్ మాత్రమే వసూలు చేస్తోంది. జలమార్గానికి అమెరికా గార్డియన్‌గా వ్యవహరిస్తుందని, సురక్షితమైన నౌకాయానం కోసం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించామని ట్రంప్ చెప్పారు. ఫీజు వసూలు చేయాలన్న అమెరికా నిర్ణయంపై షిప్పింగ్ పరిశ్రమ మండిపడుతోంది. దీనిని ‘రహదారి దోపిడీ’గా అభివర్ణించింది. కాగా హార్ముజ్‌లో వాణిజ్య నౌకలకు భద్రత కల్పించి, వాటి సురక్షిత ప్రయాణానికి సాయపడేటప్పుడు ఆ సేవలకు రుసుము వసూలు చేయడం సబబేనని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. అయితే అమెరికా విధించాలని ఫీజు చాలా ఎక్కువగా ఉన్నదని, తాము మాత్రం న్యాయసమ్మతంగానే చూస్తున్నామని చెప్పారు.
సౌదీ విమానాశ్రయంపై హౌతీల దాడి
సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు సోమవారం క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసిందని, ప్రతీకారంగానే తామూ దాడికి పాల్పడ్డామని హౌతీలు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం సౌదీ బ్లాక్‌ని సంకీర్ణ సేనలు హౌతీలలోని ప్రాంతాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ తాజా దాడులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత. సౌదీ గగనతలంపై సరఫరావద్దంటూ హౌతీల సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరి విమానయాన సంస్థలను హెచ్చరించారు. సనా విమానాశ్రయంపై విధించిన దిగ్బంధనాన్ని తొలగించే వరకూ ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. కాగా ఇరాన్ విమానాలు దిగకుండా అడ్డుకునేందుకే సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగింది యెమన్ ప్రభుత్వం అంతకుముందు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు గతంలోనే ప్రకటించారు. ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని సోమవారం అత్యవసర సమావేశంలో ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది.
– ప్రకటన –

