పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది.
బుధవారం పేపర్ నోటిఫికేషన్ ప్రచురించాలని, 16వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించాలని, ఈ నెల 17న అడ్మిషన్లు పూర్తిచేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన సూచించింది. వివరాల కోసం https://tgecet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.

