ఆర్ఎస్ పురా బాస్మతి బియ్యం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రకం బాస్మతి బియ్యం ఒక్క ఇండియాలోనే పండుతుంది. అది కూడా జమ్మూలోని పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలనే.. అక్కడ చెనాబ్ నదీ పరివాహక ప్రాంతంలో 30 వేల హెక్టార్లలోనే ఈఎస్ఆర్ పురా బాస్మతి రకం బియ్యాన్ని పండిస్తారు. ప్రతి ఏటా లక్ష నుంచి లక్ష 40 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుంది. ఈ బాస్మతి బియ్యం ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుంది.. ఈ బాస్మతి బియ్యం ఎంత ఫేమస్ అంటే.. మన దగ్గర కిలో 120 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది.
ఫస్ట్ టైం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆర్ఎస్ పురా బాస్మతి బియ్యానికి గడ్డు కాలం వచ్చింది. రుతుపవనాలు వచ్చినా వర్షాలు పడకపోవటం.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం.. స్థానికంగా నదులు, కాలువల్లో నీళ్లు లేకపోవటంతో పంట సాగు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు వేసినా.. వర్షాలు లేక నీళ్లు లేక నాట్లు ఎండిపోయాయి. నైరుతి రుతుపవనాలు దేశంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవటంతోపాటు.. సాధారణం కంటే చాలా తక్కువగా వానలు పడడంతో.. వరి నాట్లు ఎండిపోయాయి. ఇప్పటికీ వేలాది ఎకరాల్లో అసలు నాట్లు కూడా పడలేదు. ఈ విధంగానే ఆర్ఎస్ పురా బాస్మతి బియ్యం పండించే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
వేలాది ఎకరాల్లో నాట్లు వేయకపోవటం కూలీలకు పనులు లేవు. విత్తనాలు నాటే సమయం గడిచిపోతుందని.. నాట్లు వేసే కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవటంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.
ఆర్ఎస్ పురా బాస్మతి బియ్యం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బిర్యానీ, పులావ్ ఈ బియ్యంతోనే తయారు చేస్తారు. ఫస్ట్ టైం ఈ బియ్యానికి కొరత రాబోతోంది..

