ఉదయం 6 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం
విశాలాంధ్ర.. సూళ్లూరుపేట..
భారత అంతరిక్ష రంగంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్కై రూట్ ప్రైవేట్ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ -1 రాకెట్ ను నేటి ఉదయం 11.30 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరును నామకరణం చేశారు. ఈ రాకెట్ లో స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3డి ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లు అమర్చబడి ఉన్నాయి. సుమారు 350 కిలోల బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను 450 ఎత్తులోని6 కక్షలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. విక్రమ్ -1 రాకెట్ ద్వారా గ్రహ స్పేస్, కాస్మో సర్వి, డి క్యూ బడ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమోన్ స్టేషన్ పేలోడ్లతో పాటు స్కై రూట్ కి చెందిన స్కోప్ ను రోదసిలోకి తీసుకువెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబందించిన ఐదున్నర గంటల కౌంట్ డౌన్ ను ఈరోజు ఉదయం 6 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాను ఇస్రో వర్గాలు తెలియజేసారు.
పోస్ట్ నేడే విక్రమ్ -1 రాకెట్ ప్రయోగం మొదట కనిపించింది విశాలాంధ్ర.

