బల్కంపేట్ | ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్ధించానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బల్కంపేట్ | ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్ధించానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరైన శ్రీనివాస్ యాదవ్కు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2014 వరకు అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల నిర్వహించేవారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆలయ ముందు నిర్మించిన భారీ రేకుల షెడ్డు కింద లక్షలాది మంది భక్తులు వీక్షించేలా అమ్మవారి కళ్యాణం నిర్వహించేందుకు వస్తున్నామని పేర్కొన్నారు. అమ్మవారి కళ్యాణానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలతో విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలి. పాడిపంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

