ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రదాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడని, అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని విమర్శలు గుప్పించాడు. ఐపిఎల్ 2026 సీజన్లో అద్వితీయమైన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్‌లో ముందుగా వైభవ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లోనూ తొలి మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడించగా.. వైభవ్ విఫలమయ్యాడు. దీంతో ఆఖరి మ్యాచ్‌కి 15 ఏళ్ల కుర్రాడి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీశాడు. జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడని, 18 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాది అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఘనత వయస్కుడిగా సృష్టించాడని, ఇప్పటికైనా తరుపరి సిరీస్‌లలో అతడిని పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు.

