ప్రధానమోదీ నార్వే టూర్ పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సెటైరికల్ గా ఉన్నారు. మోదీజీ ..పెన్షన్ నిధి బ్లాక్ లిస్టునుంచి అదానీని తొలగించాలని మీరు చేసిన రిక్వెస్ట్ ను నార్వే ఒప్పుకుందా అంటూ సెటైర్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ టూర్ దేశం కోసం..ఆయన ఫ్రెండ్ అదానికోసం అని విమర్శలు గుప్పించారు. ఇండియా, నార్వే జెండాలతో కూడిన పోస్ట్‌లో గతంలో నార్వే అదానీ గ్రీన్ ఎనర్జీని బ్లాక్ పెట్టిన న్యూస్, ప్రస్తుతం మోదీ పర్యటన గురించి హైలైట్ చేస్తూ X లో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పర్యటన వెనక దాగివున్న అసలు నిజం ఇదా అంటూ కామెంట్స్ చేశారు.
ఈ పోస్ట్‌లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. మీమ్స్, ఫోటోలు షేరింగ్, కామెంట్లతో కామెంట్ బాక్సులను నింపేశారు. మోదీ పర్యటన వెనక అసలు రహస్యం ఇదా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2026 ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను నార్వే తొలగించడం. ఆ వ్యవహారం చక్కబెట్టేందుకు మోదీ నార్వే పర్యటనకు వెళ్లారని..ఆయన ఏది చేసినా ముందస్తు ప్లాన్ తోనే చేస్తారని సెటైర్లు వేశారు.
ఇక కొందరు.. అదానీ నా నమ్మకం, నా మిత్రుడు, నా ప్రాణం.. విదేశీ పర్యటన కేవలం ఒక సాకు మాత్రమే, ఒక మిత్రుడి వ్యాపారాన్ని కాపాడటానికి నేను అక్కడికి వెళ్లాను.. జై శ్రీ అదానీ అంటూ సెటైరికల్ పోస్ట్‌లు షేర్ చేశారు.
2026 ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) ను ప్రపంచంలోనే అతిపెద్ద 1.2ట్రిలియన్ డాలర్లు తన సావరిన్ వెల్త్ ఫండ్ (సావరిన్ వెల్త్ ఫండ్) నుంచి తొలగించింది నార్వే. ఆర్థికనేరాల ఆరోపణలతో AGELను తన పోర్ట్ ఫోలియో నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీనితో పాటు 2024మేలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌ను నార్జెస్ బ్యాంకు బ్లాక్ లిస్టులో చేర్చింది. ఈ ప్రధాని మోదీపర్యటనపై రాహుల్ గాంధీ సెటైరికల్ పోస్టులు చేయడం ఆసక్తికరంగా మారింది.

