సీఎం విజయ్ వైరల్ అసెంబ్లీ వీడియో: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొట్టమొదటిసారి అసెంబ్లీ లో తన వైపు నుండి తీవ్ర స్వరం వినిపించాడు. ఎన్నికల ప్రచారంలో కూడా చాలా సాఫ్ట్ తోనే ప్రసంగాలు ఇచ్చిన విజయ్, ఒక్కసారి గా ఇలా అసెంబ్లీ లో ప్రత్యర్థులపై అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. విజయ్ దెబ్బకు DMK పార్టీ నేతలు అసెంబ్లీ నుండి వాకౌట్ అవ్వడం, చివర్లో విజయ్ ఒక కుట్టి స్టోరీ అంటూ స్టాలిన్ ని అనుకరించి మ్యానిరిజం చేయడం హైలైట్ గా నిలిచిన అంశం. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది.ఇంతకీ స్టాలిన్ కి విజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే,’ఒక ఊర్లో పెద్దాయన కళ్ళు కనపడక,కంటి మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కుర్రాడు ఏమి వెతుకుతున్నాడు అని అడుగుతాడు. ఇక్కడ మీ నాన్న ఉంటాడని చెప్పారు, అందుకే చూస్తున్నాను, మీ నాన్న ఎక్కడ?, అసలు కనపడట్లేదే?’ అంటూ విజయ్ స్టాలిన్ ని ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేసాడు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం స్టాలిన్, కొలత్తూరులో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ మాత్రం గెలిచాడు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లీడర్ గా కొనసాగుతున్న పరిస్థితి.విజయ్ ఈ ఎన్నికల్లో స్టాలిన్ కి ఎదురైన ని వెక్కిరిస్తూ, ఆయన మ్యానరిజం ని సినిమాటిక్ స్టైల్ లో అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది.గతంలో ఉదయ్ నిధి స్టాలిన్ అసెంబ్లీలో సీఎం విజయ్ పై విమర్శలు చేశారు. కానీ విజయ్ వైపు ఎలాంటి కౌంటర్ రాలేదు. సీఎం అయ్యాక విజయ్ ఇంత సైలెంట్ అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా నిరాశ చెందారు. అలాంటి సమయం లో విజయ్ ఈ రేంజ్ కౌంటర్ ఇవ్వడం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మీదట కూడా ఇదే రేంజ్ కౌంటర్లు విజయ్ నుండి రాబోతున్నాయి.

