ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసు ఆశలు సజీవంగా ఉంటాయి. ఓటమి పాలయితే మాత్రం చెన్నై రేసు నుంచి తప్పుకున్నట్లవుతుంది. అందుకే చెన్నైకి ఈ మ్యాచ్ ముఖ్యమైనది.
గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్…
గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. తొలి రెండు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచేందుకు పోరాడాల్సి ఉంటుంది. గుజరాత్ కు లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో గెలిచి టాప్ ప్లేస్ సాధించాలన్న కసితో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో పన్నెండు పాయింట్లతో ఉండగా, గుజరాత్ టైటాన్స్ పదహారు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

