ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుంది.ముల్తాన్ పూర్ లో రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్నది నేడు తేలనుంది. రెండు జట్లు ఈ సీజన్ లో బాగా ఆడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ తొలి నుంచి రాణిస్తూనే ఉంది. కొద్ది ఓటములు ఎదురైనప్పటికీ అత్యధిక విజయాలను నమోదుచేసుకుని ప్లే ఆఫ్ బెర్త్ ను సంపాదించింది.
మరొకవైపు రాజస్థాన్ రాయల్స్ నుకూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. తొలినాళ్లలో కొంత తడబడినాతర్వాత వరస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ బలంగా కనిపిస్తాయి. ఈ మ్యాచ్లో ఓటమి పాలయిన జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. గెలిచిన జట్టుతో గుజరాత్ టైటాన్స్ పోటీపడుతుంది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుట నేడు ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా మారనుంది. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

