నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో గెలిచినా, ఓడినా ఒకటే. ఇప్పటికే బరి నుంచి ఆ జట్టు తప్పుకున్నట్లయింది. ఈ మ్యాచ్ లో గెలుపు పంజాబ్ కు అవసరం. పంజాబ్ కింగ్స్ గెలిస్తేనే ప్లేఆఫ్ రేసులో నాలుగో ప్లేస్ లో ఉండనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ…
లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకూ పదమూడు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లలో గెలిచి తొమ్మిది మ్యాచ్ లలలో ఓడింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ పదమూడు మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచి ఆరు మ్యాలలో ఓడింది. పదమూడు పాయింట్లతో ఉంది. అయితే పంజాబ్ వెనకనే కోల్ కతా నైట్ రైడర్స్, ముందు రాజస్థాన్ రాయల్స్ ఉండటంతో పంజాబ్ కింగ్స్ కు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి.

