- నాకు ఇష్టమైన వ్యక్తులో భారతీయురాలు, పాకిస్తానీ..
- భార్య ఉషా వాన్స్‌తో పాక్ ఆర్మీ చీఫ్‌తో పోలిక..
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై చర్చ..
JD Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు అని, వారిలో ఒకరు భారతీయురాలైన తన భార్య ఉషా, రెండో వ్యక్తి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని అన్నారు. గత మూడు నెలల్లో అసిమ్ మునీర్‌తోనే ఎక్కువ మాట్లాడానని చెప్పారు. మునీర్ అమెరికాకు మంచి మిత్రుడని, మంచి దౌత్యవేత్త అని వాన్స్ కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. భార్యను పాక్ ఆర్మీ చీఫ్‌తో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఈ రోజు మనం ఒప్పందంలోని సాంకేతికత గురించి చర్చిస్తున్నామని, అన్ని విభేదాలను పరిష్కరించబోమని, కానీ దీని వల్ల మొదటిసారిగా అన్ని పక్షాలు ఒక జట్టుగా కూర్చున్నాయని అన్నారు. ముఖ్యమైన సమస్యలను ఎలా పరిష్కరించాలని, మెరుగైన భవిష్యత్తు వైపు ఎలా పయనించాలో అర్థం ఈ చర్చలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని గంటల చర్చల్లో తాము పురోగతి సాధించినట్లు.
మధ్యప్రాచ్యంలో శాశ్వత కాల్పుల విరమణ అమలు చేయడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వాన్స్ అన్నారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగేలా చూడటాన్ని చూసి చూశామని చెప్పారు. శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయగల భవిష్యత్తును ఇప్పుడు చూస్తున్నామని అన్నారు.
ఈ ప్రకటనకు అమెరికన్లు ఒక రోజు చాలా ఘోరంగా పశ్చాత్తాపపడతారు.
JD వాన్స్ చెప్పారు:
“నా జీవితంలో ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని నేను చమత్కరించాను. ఒక భారతీయుడు మరియు ఒక పాకిస్థానీ. భారతీయురాలు నా భార్య, మరియు పాకిస్థానీ ఫీల్డ్ మార్షల్ మునీర్.” pic.twitter.com/0uEmpGg1vw
— ఆదిత్య రాజ్ కౌల్ (@AdityaRajKaul) జూన్ 21, 2026

