కేరళ మాజీ CM raids : కమ్యూనిస్టు పార్టీలు తరచూ తమను తాము అవినీతి రహిత రాజకీయాలకు ప్రతీకలుగా ప్రదర్శిస్తాయి. అయితే కేరళలో జరిగిన తాజా పరిణామాలు ఈ వాదనలపై మరోసారి చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులపై విచారణ జరిపేందుకు అధికారులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోదాల కోసం వచ్చిన అధికారులను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అధికారులపై దాడి చేయడంతో పాటు అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. నియంత్రణ ప్రక్రియను అడ్డుకోవడం, అధికారులపై దాడికి దిగడం వంటి ప్రభుత్వ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
“కమ్యూస్టులు అవినీతి చేస్తారు.. వారి కుటుంబాలపై దర్యాప్తు చేయడానికి ఎవరికీ హక్కు లేదు” అన్నట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు ఎదురైనప్పుడు న్యాయ విచారణకు సహకరించాల్సింది పోయి, దర్యాప్తు బృందాలపై దాడులు జరగడం ఆందోళనకరమని తెలుస్తోంది.
ఈ ఘటన కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అవినీతి ఆరోపణలు ఎవరి మీద వచ్చినా తన పని తాను చేసుకోవాల్సిందే, రాజకీయ పార్టీలు లేదా నాయకులు చట్టానికి అతీతులు కాదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఇంటి సోదాలు, అధికారులపై దాడి ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ కింది వీడియోలో వీక్షించవచ్చు.

