Marriage Scam In Uttar Pradesh: బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరారు అంటారు. పాపం వీరి పరిస్థితి కూడా అలానే ఉంది. వయసు 30 దాటినా సరే పెళ్లి కా.. వారిలో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియడం లేదు. విద్యార్హత.. ఆస్తి ప్రస్తుతం వారికి ఉద్యోగం పెళ్లిళ్లు కావడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన ఉపయోగం లేదు. దీంతో పెళ్లిళ్ల పేరయ్యల దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగేందుకు కల్యాణ తంతు జరగడం లేదు.
ఎడారిలో తిరుగుతున్న వాడికి ఓయాసిస్ తగిలినట్టు.. పెళ్లి కోసం కొంత మంది తారసపడ్డారు. పెళ్లి చెప్పారు. ఖర్చులకు 15000 ఇస్తే చాలు అన్నారు. అందమైన అమ్మాయిలు మీకోసం సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. దీంతో ఆ బ్రహ్మచారులు ఎగిరి గంతులు వేశారు. కళ్యాణం జరుగుతోందని సంబరపడ్డారు. ఖరీదైన బట్టలు కొనుక్కుంటున్నారు. బంగారం.. ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేశారు. సరిగ్గా ఆరోజు రానే వచ్చింది. నిర్వాహకులు చెప్పిన వేదిక వద్దకు గుర్రాల మీద ఆ పెళ్ళికొడుకులుగా ముస్తాబై ఆ యువకులు వచ్చేసారు. కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో ఆ యువకులలో ఆందోళన పెరిగిపోయింది.
నిర్వాహకులను అడుగుదామంటే వారు కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఆ నిర్వాహకులు చెప్పినట్టు అదేమీ నిజమైన పెళ్లి వేడుక కాదు. మోసం చేయడానికి వారంతా ఈ ప్రణాళిక రూపొందించారు. ఏకంగా 42 మంది యువకుల వద్ద 15 వేల చొప్పున వసూలు చేశారు. చివరికి ప్లేటు ఫిరాయించారు. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు.
ఈ ఉత్తర సంఘటన భారత దేశంలో అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. చాలా రాష్ట్రాలలో అమ్మాయిలు లేక యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. వివాహాలు జరగని వారిని లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు ఇటువంటి దారుణాలకు చేస్తున్నారు. ఈ తరహా మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదని యువకులు వాపోతున్నారు. పెళ్లి అంటే డబ్బులు చెల్లించామని.. చివరికి పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వారు చెబుతుండడం ఆవేదన కలిగిస్తోంది.

