మొన్నటి వరకు అరుదైన జాబితాలో ఎంఎస్ ధోని (ఎంఎస్ ధోని) కూడా ఉండేవాడు.
ms ధోని తప్పుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఫీట్లో ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు
- ఇక పై ఆ అరుదైన జాబితాలో ధోని ఉండదు
- ప్రస్తుతం కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే
- రోహిత్, కోహ్లీ, మనీశ్ పాండే
MS ధోని : 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. ప్రస్తుతం 19వ సీజన్ జరుగుతోంది. ఎంతో మంది ఆటగాళ్లు ఈ మెగాటోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లుగా కూడా ఎదిగారు. ఎంతో మంది రిటైర్ కూడా అయ్యారు. అయితే.. ఇప్పటి వరకు కేవలం కొందరు క్రికెటర్లు మాత్రమే ఐపీఎల్ అరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు ఆడుతున్నారు.
మొన్నటి వరకు ఈ అరుదైన జాబితాలో ఎంఎస్ ధోని కూడా ఉండేవాడు. అయితే.. ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఈ జాబితా నుంచి అతడి పేరు పోయినట్లే. ఈ సీజన్లో సీఎస్కే లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడేసింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. దీనితో ధోని ఆడే అవకాశం లేదు.
ఆ ముగ్గురు..
ఐపీఎల్ అరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు ఓ ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ప్రతి సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్ అయిన ఆడారు. వారు మరెవరో కాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనీష్ పాండే. వీరిలో రోహిత్ , మనీష్ లు కనీసం రెండు ప్రాంఛైజీల తరుపున ఆడారు. అయితే.. కోహ్లీ మాత్రం ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపుననే ఆడుతున్నాడు.

