తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కళా వెంకట్రావు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయినట్లే. 2024లో ఏర్పాటయి ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యత దక్కడం గతకొంత కాలంగా కళా వెంకట్రావు సైలెంట్ గానే ఉన్నారు. కళా వెంకట్రావు గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. కానీ అటువంటి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అనేక మంది సీనియర్లను ఈసారి పక్కనపెట్టినట్లే కళా వెంకట్రావుకు కూడా చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కళా వెంకట్రావు మంత్రిపదవిలో ఉండేవారు.
కానీ ఈసారి మాత్రం ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. కళా వెంకట్రావు తనకు మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా భావించారు. అసలు టిక్కెట్ కేటాయింపు నుంచే ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరి వరకూ టిక్కెట్ ఖరారు కాలేదు. చివరి జాబితాలో చోటు దక్కింది. వెంకట్రావు ఎప్పుడూ కళా వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో అక్కడ ఆయనకు సీటు దక్కలేదు. చివరి జాబితాలో కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. బొత్స సత్యనారాయణ మీద గెలవడంతో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించడం ఆయనకు దక్కలేదు. కొండపల్లి శ్రీనివాసరావుకు దక్కడంతో ఆయన గత నుంచి మౌనంగా ఉన్నారు.
ఈసారి ఎన్నికలకు కళా వెంకట్రావు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత పెరగడంతో ఇకపై తనకు పదవులు దక్కవని భావించిన కళా వెంకట్రావు తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు ఎచ్చెర్ల నియోజకవర్గం కేటాయిస్తేనే తన కుమారుడు పోటీ చేస్తారని, చీపురుపల్లి అయితే పోటీ చేయరని కళా వెంకట్రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ సేవలను అందించడానికే ఆయన సిద్ధమయ్యారని తెలిసింది. ప్రత్యక్ష ఎన్నికలకు ఇక దూరంగా ఉండాలని కళా వెంకట్రావు డిసైడ్ అయినట్లు తెలిసింది. దాదాపుగా ఇక కళా వెంకట్రావు రాజకీయంగా రిటైర్ అయినట్లేనన్నది ఆయన అనుచరులు చెబుతున్న వాదన.

