తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను నేడు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. మూడు స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనసేన ఇప్పటికే తన పార్టీ తరుపున లింగమనేని రమేష్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నేడు చంద్రబాబు కూడా తన అభ్యర్థులను ప్రకటించనున్నారు.
నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
సానా సతీష్ కు మరోసారి రాజ్యసభ పదవిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. అలాగే భాష్యం సంస్థల అధినేత ప్రవీణ్ పేరు కూడా దాదాపు ఖరారైందని తెలిసింది. మూడో పేరులో కొంత ఆలోచనలో ఉన్నారు. బీసీ, ఎస్సీలలో ఒకరికి ఇవ్వనున్నారు. చింతకాయల విజయ్ లేదా, వర్ల రామయ్యలకు ఎవరో ఒకరికి రాజ్యసభ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది.

