Tollywood Box Office Collections: ప్రస్తుత ఓటీటీ యుగంలో ఒక సూపర్ హిట్ సినిమా వీకెండ్ దాటి వర్కింగ్ డేస్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకోవడం అంటే అద్భుతం అని చెప్పాలి. కానీ కొన్ని సినిమాలు మాత్రం 2వ వారంలో కూడా భారీ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. అందులో రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం కూడా ఉంది. ఈ సినిమా రెండవ వారంలో మంచి వసూళ్లు వచ్చాయి కానీ , ఊహించిన వసూళ్లు మాత్రం రాలేదు. 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయని ఆశించారు. కానీ తెలుగు రాష్ట్రాల కోట్ల నుండి ఈ చిత్రం కేవలం 18 రూపాయిలు మాత్రమే నమోదైంది. అయితే ‘పెద్ది’ తో పాటు , రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకు మరియు సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రెండవ వారం ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది చూద్దాం.
ముందుగా మనం #RRR గురించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రం 2 వ వారంలో తెలుగు రాష్ట్రాల నుండి 61 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానం ‘బాహుబలి 2’ చిత్రం నిల్చింది. 7 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాకు 2వ వారంలో తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి, కల్కి విడుదల 32 కోట్లు , సంక్రాంతికి వస్తున్న చిత్రం 28 కోట్లు , హనుమాన్ చిత్రం 27 కోట్లు , వాల్తేరు వీరయ్య చిత్రానికి 24 కోట్లు , మన శంకర వరప్రసాద్ గారు 22 కోట్ల షేర్ వసూళ్లు చేసారు.
అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రం 19 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రెండవ వారంలో నమోదు అవ్వగా, ‘సలార్’ చిత్రం 19 కోట్లు , పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల 18 కోట్లు వచ్చాయి. ‘పెద్ది’ చిత్రం ఉన్నటువంటి ట్రెండ్ ని చూసి 20 కోట్ల రూపాయలకు పైగా కచ్చితంగా వస్తుందని అనుకున్నారు , ఆదివారం రోజున మంచి వసూళ్లు వచ్చాయి, శనివారం రోజున కాస్త వసూళ్లు తగ్గాయి, ఆ కారణం చేతనే ఈ చిత్రం 18 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా పైన చెప్పిన చిత్రాలన్నిటికీ ఫెస్టివల్ హాలిడేస్ బాగా కలిసొచ్చాయి , కానీ పెద్ద సినిమా ఒక్క హాలిడే కూడా కలిసి రాలేదు , అందుకే ఈ సినిమా రెండవ వారంలో ఊహించిన వసూళ్లు రాలేదని అంటున్నారు.

