ఆంధ్రప్రదేశ్: జగన్ వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమవుతున్నారా? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ దేనినీ తోసిపుచ్చలేం. ప్రచారమని ఇప్పుడు అనుకున్నా.. బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించాలంటే తన బలగాన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. అదే యుద్ధనీతి. రీతి కూడా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడు సమయం ఉంది. అయితే పాలనపై వామపక్ష పార్టీల కూటమి విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబు పాలనపై విరుచుకుపడుతున్నాయి. అలాగే ప్రతి సమస్యపై పోరాడుతున్నారు. మరొకవైపు లో జరుగుతున్న ప్రతి ఘటనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎర్రదండు కార్యక్రమాన్ని రూపొందించుకుంది.
కూటమిలో బీజేపీ ఉండటంతో సహజంగానే వామపక్షాలు జగన్ కు చేరువవుతాయంటున్నారు. అలాగని జగన్ కూడా బీజేపీకి దూరం కాదు. కానీ ప్రత్యక్షంగా పొత్తు లేదు కాబట్టి వైసీపీతో కలసి నడవటానికి ఎర్రన్నలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీపీఐ నేత రామకృష్ణ ఇటీవల కాలంలో పదే పదే విమర్శలు చేయడం, సీపీఐ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సయితం ప్రతి అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగేఇక సీపీఎం తొలి నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే గళం విప్పుతూనే ఉంది. ఈ రెండు పార్టీలతో కలసి జగన్ వెళతారన్న ప్రచారం జరుగుతుంది.
ఇప్పటి వరకూ జగన్ ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చారు. వామపక్షాలు మాత్రం పవన్ తో కలసి పోటీ చేసి ఒక్కసారి కూడా దక్కించుకోలేదు. ఆ మాట కొస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వామపక్షాలకు ఇప్పటి వరకూ ఎక్కడా లేదు. అయితే జగన్ కు తన బలం, బలగంపై అపార నమ్మకం ఉంది. ఒంటరిగానే పోటీ చేయాలన్న తపన ఉంది. కానీ పార్టీని ఎదుర్కోవాలంటే ఓటు బ్యాంకు కూటమి లేకపోయినా గట్టి వాయిస్ ఉన్న వామపక్షాలు తోడుగా నిలిస్తే కొంత రాజకీయంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే చూసుకుంటే ఇంకా క్లారిటీ లేకపోయినా వామపక్షాలతో జగన్ పొత్తు పెట్టుకునే అవకాశాలు మాత్రం కొట్టిపారేయలేం.

