అగ్రరాజ్యంపై తీవ్రస్థాయిలో మండిపడిన ఖామేనీ
తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఆధిపత్యానికి అమెరికా దాడులు చేస్తుంటే…ఆత్మాభిమానం కాపాడుకోవడానికి ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. దేశాల మధ్య భౌతిక దాడులు కాకుండా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. అమెరికాను ‘క్రిమినల్ దేశం’ అని, ‘గ్రేట్ సాతాన్’ అని. ఈ సందర్భంగా మొజ్తబా ఖామేనీ తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇంతటి గొప్ప ప్రజాస్పందన ప్రాంతీయ రాజకీయ పరంగా కొత్త మార్పులకు తెరతీసిందని ఆయన అన్నారు. అమెరికా ఆధిపత్యానికి గండికొట్టేందుకు ఇదే నిదర్శనమని ఖామేనీ చెప్పారు. కాగా…జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల బలగాల దాడిలో అమెరికాకు చెందిన సైనికులు ఇద్దరు మృతి చెందగా…పలువురు గాయపడినట్లు అమెరికా ఇటీవల ధ్రువీకరించింది. దీనికి అమెరికా…ఐఆర్జీసీ స్థావరాలు సహా వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ నిల్వల కేంద్రాల లక్ష్యంగా ప్రతిదాడులు నిర్వహిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) నివేదిక.

