భారతీ ఫుల్మాలి సోషల్ మీడియా ట్రోలింగ్: ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుడుతున్నప్పుడు.. తల్లిదండ్రుల పోలికలతోనే జన్మిస్తాడు. పుట్టేది ఆడపిల్ల అయినా.. మగ పిల్లాడైనా సరే.. పుట్టే పిల్లలు అమ్మానాన్నల నుంచి జన్యులను.. వారి రూపురేఖలను.. చర్మం, అలవాట్ల వరకు పుణికి పుచ్చుకుంటారు. కానీ ఈ విషయం తెలియని కొంతమంది మూర్ఖులు ట్రోల్ చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి మహిళా క్రికెటర్గా ఉంది.
త్వరలో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది.. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో భారతి ఫుల్మాలి అనే ప్లేయర్ కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. మగాడిలా ఉందంటూ.. ఉమెన్స్ క్రికెట్ లోకి పురుషుడిని తీసుకున్నారా.. అంటూ విమర్శలు చేస్తున్నారు.
భారతి ఎత్తుకు ఎత్తు.. సౌష్టవానికి సౌష్టవంతో కనిపిస్తూ ఉంటుంది. పైగా ఈమె అద్భుతమైన క్రికెటర్. వయసు దాదాపు 31 సంవత్సరాల వరకు ఉంటుంది. మహారాష్ట్రలో పుట్టింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈ స్థాయి వరకు ఎదిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ ఈమెకు విపరీతంగా ఉంది. అందుకే నచ్చిన క్రికెట్లో మెచ్చిన ప్లేయర్ లాగా ఎదిగింది. అనేక కష్టాలు పడి.. ఈ స్థాయి వరకు వస్తే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆడ పుట్టుక పుట్టినప్పటికీ.. కొంతమంది మూర్ఖుల వల్ల మగాడిగా ఉందని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కొంతమంది అయితే భారతిని ఉద్దేశించి ట్రాన్స్ ఫర్ అంటూ విమర్శలు చేస్తున్నారు. రాయడానికి వీలు లేని భాషలో తిడుతున్నారు. వాస్తవానికి మహిళా జట్టులో అవకాశాలు రావాలంటే అంత సులభం కాదు. అనేక పరీక్షలు ఎదుర్కోవాలి. మెరుగైన ట్రాక్ రికార్డు కొనసాగించాలి. కొన్ని సందర్భాల్లో ఇన్ని చేసినప్పటికీ అవకాశాలు లభించవు. ఈ స్థాయిలో ప్రతిభ చూపించారు. ఇదే ఆమెకు తోటి ప్లేయర్లు అండగా ఉంటున్నారు. ఇటువంటివి కామన్ అని.. ఆట ద్వారా నిరూపించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు.

