అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సమీపంలోని తమ సైనిక దళాలను వెనక్కి తీసుకోబోమని వాటిని కొనసాగిస్తామని తేల్చి చెప్పటంలో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా జరుతున్నాయి. దీనికి తోడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ మళ్లీ మెదటికి రావటం, లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయటం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్లను సోమవారం దెబ్బతీశాయి. వీటికి తోడు ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో లిస్టెడ్ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.
ఈ ధర సోమవారం మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ అత్యధికంగా 750 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. అయితే 10.30 గంటల సమయంలో కొంత నష్టాల నుంచి తేరుకుని సెన్సెక్స్ 532 పాయింట్లు, నిఫ్టీ 163 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 270 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 360 పాయింట్లకు పైగా నష్టాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైల్ దాడి చేయడంతో తిరిగి మెదలైన గల్ఫ్ వార్ తీవ్రరూపం దాల్చుతుందనే భయంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 3.5 శాతం పెరిగింది. దీనితో బ్యారెల్ క్రూడ్ దాదాపుగా 97 డాలర్ల వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్ సహా టబ్రిజ్, ఇస్ఫహాన్ వంటి నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది.

