న్యూఢిల్లీ: హోర్మూజ్ జలసంధిలో యూఏఈ జెండాతో వెళుతున్న రెండు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడుల్లో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు… మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీలోని ఇరాన్ ఉప దౌత్యవేత్త మహమ్మద్ జావాద్ హుస్సేనీకి సమన్లు జారీ చేసింది. పశ్చిమాసియా సముద్ర జలాల్లో వాణిజ్య నౌకాయానానికి పెరుగుతున్న ముప్పుపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

