బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌కు సంబంధించిన ఓ వార్త హల్ చెల్ చేస్తోంది. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వీపరీతంగా వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో క్లారిటీ లేక జనాలు తెగ కంగారు పడ్డారు. మరి ఇంతకు కంగనాకు నిజంగానే పెళ్లయిందా? లేదా సినిమా షూటింగ్లో భాగమా? అనేది తెలుసుకుందాం.
వైరల్ అయినా ఫొటోల్లో.. కంగనా మెడలో మంగళసూత్రం (నల్లపూసల దండ), చేతులకు గ్రీన్ మట్టిగాజులు, లైట్ పింక్ సల్వార్ తో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ కోరికనే నెటిజన్స్ కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్లపై స్పందించిన కంగనా.. అది సినిమా షూటింగ్లో క్యారెక్టర్ లుక్ మాత్రమేనని స్పష్టం చేశారు. దానితో తాను ఎప్పుడూ సీక్రెట్గాపెళ్లి చేసుకోనని ఫ్యాన్స్‌కు మాట ఇచ్చి పుకార్లకు అడ్డుకట్ట వేసింది.
కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ”నేను ప్రతిరోజూ, దాని పరిసర ప్రాంతాల్లో షూటింగ్లలో పాల్గొంటున్నాను. సినిమా క్యారెక్టర్ మేకప్‌లో ఉన్న సమయంలో ఎవరో యాదృచ్ఛికంగా ఈ ఫోటో తీశారు. ఇప్పుడు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే పెళ్లైన మహిళల కనిపించడంలో అంత పెద్ద విషయం ఏముంది? నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషించారు. నేను మాత్రం రహస్యంగా పెళ్లి చేసుకోను.. మీకు మాట ఇస్తున్నాను” అని ఎవ్వరూ కంగారుపడకుండా నటి కంగనా క్లారిటీ ఇచ్చింది.
కంగనా తన వైరల్ వివాహిత మహిళ లుక్ గురించి కొత్త కథనాన్ని పంచుకుంది#కంగనా రనౌత్ pic.twitter.com/Xee2C1D6x7
— కంగనా అప్డేట్లు (@KR_Insta2) మే 22, 2026
కంగనా రనౌత్ సినిమాలు..
ప్రస్తుతం కంగనా రనౌత్ పాలిటిక్స్ & సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఉంది. 2025లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో ‘ఎమర్జెన్సీ’ మూవీలో నటించి మెప్పించింది. ప్రస్తుతం క్వీన్ 2 షూటింగ్లో పాల్గొంటూ బిజీ ప్రస్తుతం గడుపుతోంది. ఇటీవలే మరో కొత్త సినిమా ప్రకటించింది కంగనా. ఆమె ప్రధాన పాత్రలో ‘భారత భాగ్య విధాత’ అనే సినిమా చేస్తుంది.
ఈ మూవీ కథాంశం ప్రధానంగా భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ’26/11 ముంబై ఉగ్రదాదుల’ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఆ భయంకరమైన రాత్రి కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్ (కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్) లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఒక నర్స్ పాత్రలో కనిపించిన సమాచారం.
ఉగ్రదాడి సమయంలో ఆసుపత్రిలోని సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను ఎలా రక్షించారనేది ఆమె పాత్ర ద్వారా చూపించబోతున్నారు. ప్రముఖ నటి గిరిజా ఓక్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో మెరవనుంది. మనోజ్ తపాడియా ఈ చిత్రం కథ, దర్శకత్వం వహిస్తున్నారు.

