విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లnu మున్సిపల్ ప్రభాకర్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మా కళాశాలలో జూన్ రెండవ తేదీ నుండి జూలై మూడవ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహించిన "కంప్యూటర్ బేసిక్స్ , ఎంఎస్ ఆఫీస్ టూల్స్" శిక్షణా కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అత్యంత అవసరమని, కంప్యూటర్ నైపుణ్యాలు విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తాయని తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో వినియోగించి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని సూచించారు.ఈ శిక్షణా కార్యక్రమానికి కో - ఆర్డినేటర్ గా సి ఓబులపతి సమన్వయం కర్తగా వ్యవహరించారు అని తెలిపారు, సహ కో - ఆర్డినేటర్లు గా జి. ధనుంజయ ,జి. మీనా కార్యక్రమ నిర్వహణలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ఎస్. చిట్టెమ్మ, డా. బి. త్రివేణి, డా. ఎస్. షమీ ఉల్లా, ఎ కిరణ్ కుమార్, డా బి.గోపాల్ నాయక్, ఎం. భువనేశ్వరి, ఎం. పుష్పావతి, ఎం. సరస్వతి, బి. ఆనంద్ తదితరుల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల యాజమాన్యం భవిష్యత్తులో కూడా ఇలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను అనేకం నిర్వహించాలని విద్యార్థులు ఆకాoక్షించారు. మరిన్ని అవకాశాలు విద్యార్థులకు కల్పించనున్నట్లు వారు తెలిపారు.
పోస్ట్ కంప్యూటర్ సర్టిఫికెట్ల ప్రదానం .. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మొదట కనిపించింది విశాలాంధ్ర.

