మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ వరదల్లో వందలాది సిలిండర్లు కొట్టుకుపోయాయి.ఖలాపూర్ తాలూకాలోని చవానే గ్రామంలో హెచ్‌పీసీఎల్‌కు చెందిన గ్యాస్ సిలిండర్ల గోదాం నీట మునిగిపోయింది. భారీ వేగంతో వచ్చిన వరద నీరు హెచ్‌పీసీఎల్ ప్రాంగణంలోకి దూసుకెళ్లడంతో ప్రాసెసింగ్, రీఫిల్లింగ్ కోసం హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు తరలించిన ఖాళీ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

