దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని రోహిణి సెక్టార్-16 ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న వేళ ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రామ్ కిషోర్ (42) అనే కార్మికుడు మరణించాడు. శిథిలాల కింద యజమానితో పాటు మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు.సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీస్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు.జేసీబీలు, హైడ్రాలిక్ కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగింది. ఇప్పటివరకు కొందరిని సురక్షితంగా వెలికితీసి ఆసుపత్రికి చేరుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

