కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కృషి తాపండ ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రాజ్‌కుమార్, వయసు సుమారు 45 ఏళ్లు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పరిధిలో ఉన్న నటి కృషి తాపండా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నటి కృషి తాపండ ఇంట్లో లేని సమయంలో వివేక్ ఆమె నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి వివేక్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం మేరకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వ్యాపారంలో భారీగా నష్టాలు రావడం వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నటి కృషి తాపండాతో పాటు వివేక్ కుటుంబ సభ్యులను కూడా విచారించి వివరాలు సేకరిస్తున్నారు.

