తెలంగాణ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పెద్దచెరువుకు సీతారామ ప్రాజెక్టు( సీతారామ ప్రాజెక్ట్ ) కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా శుక్రవారం గుంపెన పెద్దచెరువును ఎమ్మెల్యే పరిశీలించి,వెంటనే నీటి విడుదలకు అవసరమైన చర్యలను అధికారులు నిర్వహిస్తున్నారు.అలాగే సీతారామ ప్రాజెక్టు కాలువ వెంబడి ఉన్న సుమారు 10 చెరువులకు తూములు ఏర్పాటు చేసి గోదావరి జలాలను చేపడతామని తెలిపారు.
ఈ చర్యల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.చెరువుకు గోదావరి జలాలు చేరడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ( ఎమ్మెల్యే జారె ఆదినారాయణ )కాంగ్రెస్ నాయకులు,రైతులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.రైతులకు సాగునీటి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

