శివసేన (యూబీటీ) ఎంపీలు షిండే సేనలో విలీనానికి స్పీకర్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రత్యర్థులను బలహీనపరచి, విడదీసి లబ్ధిపొందడం, స్వపక్షాలను దృతరాష్ట్ర కౌగిలితో నిర్వీర్యం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఏడ్డీయే కూటమిలో ఉన్న నితీశ్‌కుమార్‌ను ఇదే విధంగా గద్దెదించి ఆ సీటును ఆక్రమించారు. అంతకు ముందు మహారాష్ట్రలో ఇదే పరిస్థితి. శివసేనను రెండు ముక్కలు చేసి అధికారం చేజిక్కించుకున్నారు. వారికి వ్యతిరేకంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన (యూబీటీ)లో మల్లీ చీలికలు తెచ్చి శివసేన (షిండే)కు మద్దతు పలుకుతున్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీటీసీ) ఎంపీలో ఇటీవల తిరుగుబాటు చేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 20 మంది టీటీడీ చీలిక వర్గ ఎంపీలను సభలో వేరుగా కూర్చునేందుకు అనుమతించారు. వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఈ 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారికి పార్లమెంట్లో ప్రత్యేక సీట్లు కేటాయించి, టీపీసీ అధినేత్రికి పార్లమెంట్లో సంఖ్య బలం తగ్గి నోరు నొక్కేసింది. తాజాగా ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు శివసేన(షిండే)లో విలీనానికి ఆమోదం తెలిపారు స్పీకర్ ఓం బిర్లా. వీరి విలీనాన్ని స్పీకర్ ఆమోదించారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. శివసేనలో విలీనం కావడంతో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తగిలింది. ఫిరాయింపుల నిరోధక ప్రకారం అనర½త వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో స్పీకర్ ఈ విలీనాన్ని ఆమోదించినట్లు చట్టం సూచిస్తుంది. ఈ ఆరుగురు ఎంపీల రాకతో లోక్‌సభలో శిండే బలం 7 నుంచి 13కు చేరింది. దీంతో 20న జరిగే పార్లమెంట్ వరకాల సమావేశాలకు ముందు వీరు చేరికలు జరగడం. ఇలా బీజేపీ ప్రత్యర్థులను నయన, భయాన బలహీన పరచి లబ్ధిపొందుతోంది.
పోస్ట్ తిరుగుబాటు ఎంపీలకు గుర్తింపు మొదట కనిపించింది విశాలాంధ్ర.

