వారణాసి సినిమా తాజా వార్తలు: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచ స్థాయికి తెలిసేలా చేశాడు. అలాంటి రాజమౌళి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ని పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఆ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ భారీ రికార్డులను క్రియేట్ చేసింది అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.
కానీ ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా కూడా ఆ సినిమాకి 1300 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అనేది చాలా బాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి 2 సినిమాతో ప్రభాస్ 1850 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు హీరోలు ఉన్నా కూడా అంతటి కలెక్షన్స్ రాలేదు. నిజానికి సినిమా స్క్రిప్ట్‌లో గాని డైరెక్షన్లో గాని కొంతవరకు తేడా జరిగిందనే రాజమౌళి అబ్జర్వ్ చేశాడు.
వారణాసి విషయంలో అలాంటివేమి జరగకుండా ఉండడానికే ఆయన తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే వారణాసి సినిమాని లెవెల్లో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి సినిమా చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయంలో కూడా రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు.
అసలు ఏది సీజీ ఏది ఒరిజినల్ గా చేశారో తెలుసుకోలేనంత రియాల్టీలో సీజీ వర్క్ అనేది చేయిస్తున్నాడట. ఈ సినిమాతో 3000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా రాబడతాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది

