ఎంఎస్ ధోని: ధోని.. ఈ రెండు అక్షరాల పదం క్రికెట్ చరిత్రను మొత్తం మార్చేసింది. ధోనికి ముందు ధోని తర్వాత అన్నట్టుగా చేసింది.. అగ్రెసివ్ ఆట తీరును సరికొత్తగా పరిచయం చేసింది. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని నేలమట్టం చేసింది. దక్షిణాఫ్రికా దూకుడును.. న్యూజిలాండ్ వేగాన్ని తగ్గించింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. అందుకే ధోని టీమ్ ఇండియాలో అద్భుతమైన ఆటగాడిగా.. అనితర సాధ్యమైన సారథిగా నిలిచిపోయాడు.
ధోని జాతీయ జట్టు నుంచి నిష్క్రమించినప్పటికీ.. ఐపీఎల్లో చెన్నై జట్టు ఆడుతున్నాడు. గత సీజన్లో తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో చెన్నై జట్టు గొప్పగా ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్లో ఆడతాడు అనుకున్నప్పటికీ.. అతడు ఒక్క మ్యాచ్లో కూడా కనిపించలేదు. పైగా గాయాల వల్ల ధోని మైదానంలో కనీసం అడుగు కూడా పెట్టలేదు.
ఇటీవల ipl సీజన్లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత చెన్నై జట్టు ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేశారు. అందులో ధోని కూడా ఉన్నాడు. అభిమానులతో ఫోటోలు దిగాడు. జట్టు ఆటగాళ్లతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. చిరునవ్వుతో కనిపించాడు. అతడు మైదానంలోకి దిగడమే ఆలస్యం చెన్నై అభిమానులు కేరింతలు కొట్టారు. ఒకవేళ అతడు గనుక బ్యాట్ పట్టుకొని రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో.
అభిమానులు తన రాక గురించి విపరీతంగా నేపథ్యంలో చిరుకానుక అందించాడు ధోని. ప్రస్తుతం జార్ఖండ్ t20 లీగ్ నడుస్తోంది. ఆట్రోఫీలో భాగంగా ధోని మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టాస్ ప్రక్రియలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు నిర్వాహకులతో మాట్లాడాడు. ఆయా జట్ల ప్లేయర్లతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. చివరికి భార్య.. కుమార్తెతో కలిసి మైదానంలో సందడి చేశాడు. ఆ తర్వాత రాంచీ మైదానంలో కూర్చొని మ్యాచ్ చూసాడు.. ధోని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో రాంచీ మైదానం హోరెత్తిపోయింది. అంతేకాదు ధోని వస్తున్నాడని ముందుగానే నిర్వాహకులు చెప్పడంతో టికెట్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు మైదానం కూడా ప్రేక్షకులతో కిటకిటలాడింది.
,
జార్ఖండ్ T20 లీగ్ 2026 ట్రోఫీని ఆవిష్కరిస్తున్నప్పుడు MS ధోని యధావిధిగా స్పాట్లైట్ని దొంగిలించాడు! #MS ధోని pic.twitter.com/w2XGBHHi6R
— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) జూన్ 11, 2026

