విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారాయి తయారీదారులపై హిబిషన్ అండ్ ప్రొటెక్షన్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో ధర్మవరంలో దాడులు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అనంతపురం ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ప్రకారం ధర్మవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారు, ఈ ఎస్ టి ఎఫ్ బృందం పుట్టపర్తి వారు నాటు సారాయి తయారీ దారులు , అమ్మకం మద్యం దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బెల్ట్ షాపు ల పై జరిపిన దాడుల్లో 2 కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి 21 మద్యం బాటిల్ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే నాటు సారాయి కేసులో ఒక ఆడ మనిషిని అరెస్ట్ చేసి 3 లీటర్లు నాటు సారాయిని స్వాదీనం చేసుకొని , ఆమెను జుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. ధర్మవరం పట్టణంలో మత్తు పదార్థాల గురించి అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా
నాటు సారాయి తయారీదారులు మరియు అమ్మకం మద్యం దారులపై జరిపిన దాడుల్లో డి. చెర్లోపల్లి క్రాస్ లో గుంజేపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణను అరెస్ట్ చేసి, అతని నుంచి 08 మద్యం బాటిల్స్ ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అదేవిధంగా అనంతపురం ఎన్ఫోర్స్ సిఐ సునంద ఆధ్వర్యంలో మండలం ముదిగుబ్బ గ్రామంలో పరమేశ్వర్ నాయుడు అతని నుండి పది మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా తరచూ ఎక్సైజ్ నేరాలు చేసే వ్యక్తులను, పాత నేరస్థులను బైండోవర్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

