న్యూస్ డెస్క్:ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ( పూరీ జగన్నాథ్ రథయాత్ర )ఏర్పాట్లు పూర్తయ్యాయి.జగన్నాథుడు, బలభద్రుడు,సుభద్ర తమ రథాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఒడిశా ప్రభుత్వం ఈ భారీ స్థాయిలో సజావుగా నిర్వహించేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.గురువారం సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం.
ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు పూరీకి చేరుకున్నారు.ఈ నెల 24న యాత్ర ముగుస్తుంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

