కేంద్ర ఎన్నికల సంఘం
నేడు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను కాంగ్రెస్ నేతలు తెలియజేస్తారు. మధ్యప్రదేశ్ లో రాజ్యసభ స్థానానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై…
అయితే ఎన్నికల అఫడవిట్ లో ఆస్తులను పొందుపర్చలేదని బీజేపీ ఫిర్యాదుతో ఎన్నికల అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ నేతలుఈసీని కలసి ఫిర్యాదు చేయనున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో కూడా ఉన్నారు.

