పంజాగుట్ట: సైబర్ నేరగాళ్లు పోలీసులను సైతం వదలడంలేదు. పంగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఫోన్ కు టిఎస్ కాప్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఎపికె ఫైల్ ను పంపారు. తొందర పాటు చూసుకోకుండా అతని పైల్స్ ను ఎస్ఐ ఓపెన్ చేయడంతోనే అతని బ్యాంక్ ఖాతాలో పలు విడతలుగా 50 వేల రూపాయలు మాయం అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

