ఆంధ్రప్రదేశ్:బాపట్ల పట్టణంలోని ఆంధ్రకేసరి నగర్లో విశ్రాంత ఏడీ పోకల వెంకటేశ్వరరావు ( AD Pokala Venkateswara Rao )ఇంటి పెరట్లో అరుదైన భారీ కంద జాతి పుష్పం పూసి ఆకట్టుకుంటోంది.బెంగళూరులో కొనుగోలు చేసిన కందను ఇంటి వద్ద నాటగా,ఇటీవల భారీ ఆకారంలో పువ్వు విరబూసింది.
ఏనుగు పాదాన్ని పోలి ఉండే ఈ పుష్పాన్ని శాస్త్రీయంగా ‘ఎలిఫెంట్ ఫుట్ యామ్’గా పిలుస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు.పదేళ్లకు ఒక్కసారి మాత్రమే మే,జూన్ నెలల్లో ఈ పుష్పం పూస్తుందని,దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

