రెండేళ్లుగా అడ్మిషన్లు నిల్… రూ.45 కోట్ల వరకు నష్టం
700 మంది పరిశోధక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
విశాలాంధ్ర- విశాఖపట్నం: జాతీయ విద్యా విధానం-2020 (ఎనఈపీ-2020) లక్ష్యాలకు అనుగుణంగా అంతర్ విభాగ పరిశోధనలకు వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ హబ’ (ఏయూ టీడీపీఆర్ హబ్) అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అంతర్గత విభేదాలు, పరిపాలనా నిర్ణయాలు, అధికార పోరు కారణంగా నిర్వీర్యమవుతోంది. రెండేళ్లుగా కొత్త అడ్మిషన్లు నిలిచిపోయాయి. వందలాది మంది పరిశోధనా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ మేరకు విద్యా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీఆర్ హబ్ ద్వారా తమ ప్రభావం తగ్గనే భావనతో తప్పుడు సమాచారం చేరవేసి, క్రమంగా అడ్మిషన్లు నిలిచిపోయేలా కొందరు అధ్యాపకులు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌నే రెండేళ్లుగా కొత్త ప్రవేశాలు నిలిపాయని, విశ్వవిద్యాలయానికి రూ.40`రూ.45 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్న అంచనా. ఈ పరిస్థితులతో సుమారు 700 మంది పరిశోధకుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే పరిపాలనా ఇబ్బందులు తెలిపిన సమాచారం. స్వతంత్రంగా పనిచేసిన టీడీఆర్ హబ్ పరిశోధనలను సాధారణ విశ్వవిద్యాలయ విభాగాల్లో విలీనం చేసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్… ఐటీ ప్రొఫెసర్లు ఇద్దరితో కమిటీని ఏర్పాటు చేసి, ఈ హబ్ కార్యకలాపాలను కొనసాగించాలని సూచించడం, ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయడం లేదన్న విమర్శలున్నాయి. హబ్ మూసివేత, అడ్మిషన్ల రద్దుకు వ్యతిరేకంగా సెనెట్ సమావేశంలో ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు సహా ఈసీ సభ్యులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సెనెట్ నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే థీసిస్ సమర్పించి, ప్రీ-టాక్ పూర్తి చేసిన పరిశోధకులను కొత్త నిబంధనల పేరుతో రీ-సబ్మిషన్, ప్రీ-టాక్ కోసం ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 45 మంది బహుమతులను థీసిస్ సమర్పించిన రెండేళ్ల తర్వాత ప్రీ-టాక్‌కు పిలవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వివాదాస్పదంగా మారింది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ అడ్జ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) చైర్మన్ అదనపు ఒత్తిడి… సమస్యలు పరిష్కరించుకోకుండా అకడమిక్ వ్యవహారాల డీన్ సూచించినట్లు వాదనలు ఉన్నాయి. 2024లో ప్రొఫెసర్ శశిభూషణరావు ఆమోదం అడ్మిషన్లపై సమీక్ష ఏర్పాటు ప్రదర్శనలు. అనంతరం ఏపీఎస్సీహెచ సూచనల మేరకు పరిశోధకులకు థీసిస్ సమర్పణకు అనుమతిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ, కొందరు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయ ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి వెళ్లిందని, ఆర్మీ మాజీ అధికారి ఈ జాప్యంతో విశ్వవిద్యాలయ ప్రతిష్టకు నష్టమని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరొక రిటైర్డ్ ఆర్మీ అధికారి తన ఫీజు తిరిగి ఇవ్వాలని, అవసరమైతే ఆ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇవ్వబడుతుందిమెయిల్ పంపినట్లు తెలిసింది. ఇంకొదరు రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. దీంతో సీనియర్ ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు, అనుబంధ కళాశాలల అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనలను ప్రోత్సహించాల్సిన విద్యావేత్తలే పరస్పర విభేదాలతో ఒక వినూత్న వ్యవస్థను దెబ్బతీయడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తక్షణమే జోక్యం చేసుకుని టీడీఆర్ హబ్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అడ్మిషన్లT పునరుద్ధరించాలని, పరిశోధకుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, ఉన్నత విద్యా వ్యవస్థపైనా ఉందన్నారు. కాగా, ఒకరిద్దరు పరిశోధకుల విషయంలో సమస్య ఉండవచ్చని, చిన్న ఇబ్బందులు మినహా అంతా సజావుగానే ఉన్నట్లు ఏయూ విద్య వ్యవహారాల డీన్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇదిలావుంటే, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘ఏయూ టీడీఆర్ హబ’ను ఇంటర్‌డిసిప్లినరీ మోడల్లో పనిచేసే విధంగా రూపొందించింది. రిటైర్డ్ ఆచార్యులు, అనుబంధ కళాశాలల సీనియర్ అధ్యాపకులు, పరిశ్రమల నిపుణులు కలిసి పరిశోధకులకు మార్గనిర్దేశనం చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. అకడమిక్‌గానే కాకుండా పరిశ్రమలకు దోహదమయ్యేలా ఈ వ్యవస్థ ఏర్పడినట్లు విద్యావేత్తలు అన్నారు. పీహెచ్డీ సీట్లకు అదనంగా ప్రత్యేక సీట్లు సృష్టించి, 202023లో టీడీపీ హబ్ ద్వారా అడ్మిషన్లు చేపట్టినట్లు సమాచారం. అధిక రుసుము రూపంలో ఏటా రూ.15కు పైగా ఆదాయం సమకూరినట్లుగా కోట్ల రూపాయలు ఉన్నాయి. అనుబంధ కళాశాలల అధ్యాపకులకు మార్గదర్శకత్వంతో వ్యవహరించే అవకాశం, పరిశోధనా పత్రాలు, అక్రిడిటేషన్, ర్యాంకింగ్స్ పరంగా ఆయా కళాశాలలకు ప్రయోజనం ఉందని చెబుతున్నారు. టీడీఆర్ హబ్ ద్వారా వెలువడిన పరిశోధనా పత్రాలు, ఇండస్ట్రీ అనుసంధానాలు, పబ్లికేషన్ల కారణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎనఐఆర్ఎఫ్, న్యాక్ ర్యాంకింగ్స్‌లో అంచనా స్కోరు పెరిగిందని విద్యాసంస్థలు ఉన్నాయి.
The post పరిశోధనపై రాజకీయ నీడలు appeared first on Visalaandhra.

