పుష్ప 2: ‘సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్లే అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. ఒక సన్నివేశం ప్రేక్షకుడు మెచ్చుకునేలా ఉండాలన్న, ప్రతి సీన్ ఎక్సైటింగ్ గా సాగాలన్న స్క్రీన్ ప్లే చాలా బాగుండాలి. అలా ఉన్నప్పుడే ప్రేక్షకుడు సినిమాను చూస్తాడు. కాబట్టి సినిమా స్క్రీన్ ప్లేలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక రీసెంట్ గా కేంద్రం 72వ జాతీయ అవార్డ్స్ ని ప్రకటించింది. ఇందులో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా పుష్ప 2 చిత్రానికి గాను సుకుమార్ పేరును ప్రకటించారు. నిజానికి 2024లో వచ్చిన తెలుగు సినిమాలన్నింటిలో ఉత్తమ స్క్రీన్ ప్లేను అందించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సినిమా స్క్రీన్ ప్లే కావడం విశేషం…ఇందులో సినిమా అంతా ఒక ఎత్తయితే లాస్ట్ లో రివిలయ్యే ఆ ట్విస్ట్ అనేది ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. నిజానికి ఇలా కూడా ఒక స్క్రీన్ ప్లే రాయొచ్చా అనేంతలా గుర్తింపును సంపాదించుకుంది.
ఇక అలాంటి సినిమా స్క్రీన్ ప్లే అవార్డు ఇవ్వాల్సింది పోయి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మాట్లో సాగిన ‘పుష్ప 2’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు ఇవ్వడం అనేది కొంతమంది సినిమా మేధావులు సైతం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు.
నిజానికి పుష్ప 2 సినిమాలో స్క్రీన్ ప్లే నార్మల్ గానే ఉంటుంది. పెద్దగా కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే గాని డిఫరెంట్ స్క్రీన్ ప్లే గాని ఏదీ లేదు అయినప్పటికి ఆ సినిమాకి అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా చిన్న సినిమాలను డిఫరెంట్ అటెంప్ట్ లతో వచ్చిన సినిమాలను ఎంకరేజ్ చేస్తే వాళ్లు మరింత సాహసాలు చేసే అవకాశం ఉంటుంది. తప్ప భారీ విజయం సాధించింది కదా అని పెద్ద సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఇంకొంతమంది సినిమా విమర్శకులైతే కామెంట్లు చేస్తున్నారు…

