తెలంగాణ:గద్వాల్ జిల్లా కేటీ దొడ్డి మండలం గంగన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్యం అందుబాటులో ఉండాలని,పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఉందని నెత్తినోరు బాదుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవేవీ కనిపించడం లేదు.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ( మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల )శనివారం కురిసిన వానలకు పాఠశాల ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది.
విద్యార్ధులు,ఉపాద్యాయులు కనీసం నడవడానికి లేని పరిస్థితి ఏర్పడింది.స్కూల్ ముందు సిసి రోడ్డు ఎత్తుగా వేసిన నీరు ఆగినట్టుగా చూపిస్తుంది.
ఇది అధికారుల నిర్లక్ష్యమా,కాంట్రాక్టర్ లోపమా? తెలియదు కానీ,విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.

