బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్‌పై కొందరు ఫిర్యాదు చేశారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల సంఘం సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ రైతులు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ జరుగుతున్న ఆందోళనల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ పాల్గొనడం లేదని తెలిపారు.
మిలిటెంట్ పోరాటం చేయాలంటూ…
మరొకవైపు మిలిటెంట్ పోరాటం పిలుపునివ్వడమే కాకుండా, సింగరేణి భవన్ ను తగుల పెట్టాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. మిలిటెంట్ పోరాటంతో పాటు ప్రభుత్వ ఆస్తులను దహనం చేయాలన్న బాల్కసుమన్ వ్యాఖ్యలపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

