Toronto Indian Celebrations: భారతీయులు ఎక్కువ ఆదాయం, ఉన్నతమైన ఉపాధి కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్తారు. మన నైపుణ్యాలతో ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో వైద్యులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు ఇలా అన్నిరంగాలవారు ఉన్నారు. అయితే ఇటీవల అమెరికా విదేశీయుల రాకపై ఆంక్షలు విధించింది. దీనితో భారతీయులు కెనడాకు ఎక్కువగా వెళ్తున్నారు. ఇప్పటికే కెనడాలో భారతీయులు ఎక్కువగా స్థిరపడ్డారు. తాజాగా అక్కడి భారతీయులు చేసుకున్న సంబురాలు.. కెనడీలకు కోపం తెప్పించాయి. టొరంటో వీధుల్లో భారతీయులు మ్యూజిక్, డాన్స్‌తో అదరగొట్టిన ఒక సాంస్కృతిక ఉత్సవ వీడియో వైరల్ కావడంతో కెనడా సోషల్ మీడియా మండిపడింది. ”కెనడా ఇప్పుడు ఇండియన్ కాలనీ అయిపోయింది”, ”టొరంటోలో కెనడియన్లు మైనారిటీ అయిపోయారు”, ”మా దేశాన్ని ఆక్రమిస్తున్నారు” అని తీవ్రమైన కామెంట్లు వస్తున్నాయి.
డెమోగ్రాఫిక్ మార్పు..
గ్రేటర్ టొరంటో ఏరియాలో సౌత్ ఆసియన్లు ఎక్కువ. ఇందులో భారతీయులు 19 శాతం మంది ఉన్నారు. టొరంటో నగరం చుట్టుపక్కల బ్రాంప్టన్, మిసిసాగా వంటి ప్రాంతాలలో స్థిరపడ్డారు. 2013 నుంచి 2023 మధ్య కెనడాకు భారతీయ ఇమ్మిగ్రేషన్ నాలుగు రెట్లు పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ఎక్కువ శాతం మంది ఉన్నారు, గత కొన్ని సంవత్సరాల్లో టొరంటోలో భారతీయుల సంఖ్య పెరిగింది. ఈ వేగవంతమైన మార్పు కెనడా సమాజంలో ఒక ఉనికిని కలిగించింది. హౌసింగ్ క్రై సిస్, అద్దెల పెరుగుదల, ట్రాఫిక్, ఉద్యోగాలపై పోటీ ఇవన్నీ ఇమ్మిగ్రేషన్‌తో ముడిపడి చూడడం మొదలైంది. అధికారిక అధ్యయనాల ప్రకారం, ఇటీవలి ఇమ్మిగ్రేషన్ హౌసింగ్ ధరలు భారీగా పెరిగాయి. స్థానికులకు ఆదాయం పెరిగింది.
సాంస్కృతిక ఉత్సవాలు..
భారతీయులు తమ సంస్కృతి, పండగలు, సంగీతం-నృత్యాలను ఉత్సాహంగా జరుపుకోవడం సహజం. కానీ రోడ్డు జంక్షన్లను ఆక్రమించి, ట్రాఫిక్‌ను అడ్డుకుని, శబ్దం చేసి సెలబ్రేషన్స్‌లో స్థానికులకు తీవ్రం కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు ఇటీవలి కాలంలో పలుమార్లు ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కొత్త దేశంలో స్థానిక నియమాలు, చట్టాలు, సామాజిక సౌకర్యాలను గౌరవించాలి. కానీ మన ఉత్సవాలతో అక్కడి వారికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనితో కెనడా ప్రభుత్వం 2025-2027 ఇమ్మిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్‌లో స్పష్టమైన మార్పులు చేసింది. స్థిర నివాసుల లక్ష్యాలను తగ్గించడంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థులు, టెంపరరీ ఫారిన్ వర్కర్ల సంఖ్యను తగ్గించారు. 2026లో స్టడీ పర్మిట్లు కొత్త తగ్గాయి.
కెనడా చరిత్రే వలసదారుల చరిత్ర..
ఇంగ్లీష్, ఫ్రెంచ్ నుంచి ఆసియా దేశాల వరకు వచ్చినవారే కెనడా దేశాన్ని నిర్మించారు. భారతీయులు ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రంగాల్లో ముఖ్యమైన సహకారం అందించారు. వైవిధ్యం కెనడా బలం. మరోవైపు, స్థానికుల ఆందోళనను కేవలం ”రేసిజం” అని తోసిపుచ్చడం సరికాదు. ఏ దేశంలోనైనా వేగవంతమైన డెమోగ్రాఫిక్ మార్పులు సామాజిక ఉద్రిక్తతలను సృష్టిస్తాయి. స్పేస్‌లను ఆక్రమించి, ట్రాఫిక్‌ను అడ్డుకుని, లిట్టర్ పబ్లిక్ చేసి జరిపే సెలబ్రేషన్లు స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచుతాయి.
ఈ వివాదం భారతీయ వలసదారులకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది. ఉత్సాహం మంచిది, కానీ బాధ్యత కూడా అవసరం. కొత్త దేశంలో స్థానిక నియమాలను గౌరవించడం, పొరుగువారికి ఈ విషయం కలిగించకుండా జరుపుకోవడం ముఖ్యం.

