వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన, గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రాజా రవీందర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని మినిస్టర్ నారాయణగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మంత్రి నారాయణగా రాజా రవీందర్ లుక్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువా ధరించి ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

