- తెలంగాణలో మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని వెల్లడి
- ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంలా వ్యవహరిస్తోంది: మహేశ్ గౌడ్
- పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్‌లో అధికారులు తిరస్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ బీజేపీ చేసిన రాజకీయ కుట్ర అని సీఎం. దేశంలో ఇప్పటికే ‘ఓట్ చోరీ’, ‘సర్’ వంటి అప్రజాస్వామిక చర్యలకు శ్రీకారం చుట్టిన బీజేపీ.. ఇప్పుడు ‘సీట్ చోరీ’కి తెరలేపిందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని.. అయినా, గెలవలేమనే భయంతోనే కుట్రపూరితంగా ఆమె నామినేషన్ ను తిరస్కరించారని. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బహిరంగ ఎన్నికల కమీషన్‌ను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజల గొంతు నొక్కేలా జరిగిన ఈ దాడి భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ‘చీకటి రోజు’ అని, న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట అని ఆయన ఉన్నారు. గెలవలేమనే భయంతో, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఇలాంటి దుశ్చర్యలు కనిపిస్తున్నాయి మంగళవారం ఓ ప్రకటనలో.
చివరకు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్నికల కమీషన్ సైతం స్వతంత్రతను కోల్పోయింది, పూర్తిగా బీజేపీకి ఒక అనుబంధ సంఘంలా వ్యవహరిస్తోంది. కేంద్ర పెద్దల కనుసన్నల్లోనే ఈ నామినేషన్ తిరస్కరణ పర్వం నడిచింది. బీజేపీ అధికార బలంతో సాగుతున్న ఈ తరహా నిరంకుశ, రాజకీయ కుట్రలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారని మహేశ్‌గౌడ్ హెచ్చరించారు.
బీజేపీ భయానికి నిదర్శనం: మంత్రులు
మీనాక్షి నటరాజన్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే బలమైన గొంతుక అని, ఆమె సభలోకి వస్తే తమ వైఫల్యాలను నిలదీస్తారనే భయంతోనే బీజేపీ ఈ హేయమైన చర్యకు ఒడిగట్టిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క ఇతర రాష్ట్ర మంత్రులు ఉన్నారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ.. ఇలా అక్రమ మార్గాల ద్వారా జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రతి పౌరుడికి, రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉందని, దాన్ని హరిస్తే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులందరూ ఈ చర్యను ఖండించాలని. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటోందని మంత్రులు. ఈ ఘటనలో పార్టీలో న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రులు.

